శ్రీ సూర్య సదనము - విశిష్టత
పరమ పూజ్య సద్గురు కృష్ణయాజి గారి చే నిర్మించ బడిన శ్రీ సూర్య సదనము సర్వ దేవతామయం.
అనేక సం॥ల క్రితము ఈ స్థలములో యోగులు సంచరిన్చినట్లుగా దివ్యజ్ఞాన సంపన్నుల నిర్ణయము. ఈ స్థలమందు 108 విగ్రహములతో కూడిన సూర్య స్థూపము 3 అంతస్తులుగా నిర్మించి, కర్నికయందు మోహిని సహిత ఖషోల్కుడుని ప్రతిష్టించిరి. ఈ స్థూపము నందు జప, ధ్యాన, యోగ, ప్రదక్షిణలు చేసిన అద్భుత ఫలితములను నోసంగుచున్నది. దీని ప్రక్కనే సౌరాయాగశాల, పంచ హోమ గుండములు, శ్రీ గాయత్రీ మాత, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి విగ్రహములు దర్శనమిస్తాయి.
శ్రీ సత్య సాయి ధ్యాన మండపము భూమికి 12 అడుగుల లోతులో నిర్మించ బడినది. శ్రీ సాయి సద్గురుధామ్ లో సద్గురు కృష్ణయాజి గారి పూజ మందిరం కలవు. ఈ పూజ మందిరం లో వందలాది సం॥లుగా తరతరాలు అర్చించబడిన దేవతా మూర్తులు, యంత్రాదులు విశేష పూజ మూర్తులు దర్శనమిస్తాయి. మానవుని ఆధి వ్యాధులు ను పోగొట్టు శ్రీ ధన్వంతరి విగ్రహములతో కూడిన యాగశాలలో
సర్వ దేవతా, ఋషుల మూర్తులు కోలువై వుంటాయి. శ్రీ జగద్గురు గణపతి సచిదనంద స్వామిజి వారు స్వహస్తముల తో వేసిన కదంబ, ఔదుంబరవృక్షములు కల్ప వృక్షముల వలె కనిపించును. నాగ దేవత, శ్రీనివాస బాబా విగ్రహములు వృక్ష ఛాయలో కలవు. ఈ ప్రదేశములో మహాసౌరయాగము, చండీ యాగము, నవదుర్గా యాగము శ్రీ ప్రత్యంగిరా, శ్రీ రుద్ర, గణేష, హనుమత్ వంటి దేవతా యాగములు అనేకములు అనేక పర్యాయములు జరిగినవి. 2010-2011 సం॥ లలో 24 యాగములతో పాటు దీర్ఘసత్రయాగము జరిగినది. దేశారిష్టములు తొలగి లోకకల్యాణ కాంక్షతో 365 రోజులు శ్రౌతయాగము నిర్వహించిరి. యాగ దర్శనమునకు ఆనేకమంది తపోధనులు యోగులు, పీఠాధిపతులు విచ్చేసిరి. కావున ఈ స్థలము అతి పవిత్రమైనది.
భక్తి, జ్ఞాన, వైరాగ్య, మోక్షఇచ్చ కలిగిన వారికి సర్వ కామ్య ప్రదాయకం శ్రీ సుర్యసదనము. అనేకమంది పీఠాధిపతులు, మంత్ర, తంత్ర, శాస్త్ర వేత్తలు, పండితులు, ఉపాసకులు, స్వామీజీలు, మతాజీలు , నడయాడిన పవిత్ర భూమి శ్రీ సుర్యసదనము. “సదనం” అనగా యజ్ఞవాటిక అని అర్ధం. పేరుకు తగ్గట్టుగా నిత్యము యజ్ఞయాగాది కార్యక్రమములు ప్రత్యక్షదైవము సూర్యుని సాక్షిగా జరుగును కావున శ్రీ సుర్యసదము సార్ధక నామధేయమైనది.