విరాళాలు

శ్రీ సూర్య సదనం లో “శ్రీ గొపాల కృష్ణ గో సంరక్షణ “శాలా” పేరుతో. నిత్య గోపూజ, గో సంరక్షణ జరుగుచున్నది. సకల దేవతా స్వరూపిణి, జగదంబ ప్రత్యక్ష రూపం గా నిత్యం “గోపూజ” “గోఫలవ్రతం” భక్తుల కొరకు నిర్వర్తించుట, గోసూక్త పారాయణ చెయబడుచున్నది. ఆసక్తి గలవారు ఆర్ధికంగా పాల్గొనవచ్చును. మీగోత్రం-పేరుతో గోపూజ-హవనము చేయబడును.

విశ్వమానవాళికి శ్రేయస్సును జ్ఞానమును ప్రసాదించే శాస్త్రము “వేదము”.వేదము అనగా తెలుసుకొనుట.లౌకిక-పార లౌకిక విషయములను ధర్మాలను-కర్మలను ప్రతిపాదించు వేద విజ్ఞానము పరి రక్షణ-ప్రచారము గత 60 సంవత్సరములుగా యధాశక్తి చేయుట జరుగుచున్నది. వేదము-వేదాంగములు నేర్పించుట నిరాటంకముగ జరుగుటకు వేద విద్యార్ధులకు వసతి-భోజన, ఫలహారము,వస్త్రములు,ఉపాధ్యాయునికి తగురీతిలో జీతభత్యములు ఏర్పాటు కొరకు “వేదనిధి”ని ఏర్పాటు చేయుట జరుగుచున్నది.ఆసక్తి గల వదాన్యులు స్పదించి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన వలసినదిగా కోరుచున్నాము-వేదము,సంస్కృతము,జ్యోతిషము,ఆగమము,స్మార్తము,వాస్తు,శాస్త్రములు బోధించుట జరుగును.


శ్రీ సూర్యసదనములో “సవితా వేదిక్ ఫౌండేషన్ మరియు స్కై చారిటబుల్ ట్రస్ట్” నిర్వహణలో నిత్యము అన్నసమారాధన జరుగుచున్నది మరియు విశేష పర్వదినములలో భక్తులకు అన్న సమారాధన-జరుగును.ప్రతి ఆదివారం పేదలకు అన్నదానం చేయుదురు.కావున భక్తులు,ఆసక్తి గలవారు ఈ ఉదాత్త మైన అన్నదాన కార్యక్రమమునకు సహకరించవచ్చును.

సహస్ర ఆదిత్య అన్నదానము SKY చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడును:
దానములలో అతి ఉత్కృష్టమైన దానం అన్నదానం. వెయ్యి [1000] ఆదివారములు అన్నదానము  చెయ్యాలని సంకల్పము తో ఆరంభించుట జరిగినది. 
భారతదేశమున మన ప్రాచీన సంప్రదాయంలో సూర్యునియొక్క ఆరాధన చాలా ప్రధానమైనది. అట్టి ఆదిత్యులు విశ్వం లో వెయ్యిమంది వున్నారు అని వేద వచనం. కావున వారి ప్రీతి కొరకు ఈ సహస్ర ఆదిత్య అన్నదానం జరుగుచున్నది. 

1. సహస్ర ఆదిత్య అన్నదాన(శాశ్విత నిధికి) “మహారాజ పోషకులు” — 100000 /- (ఒక లక్ష)
2. సహస్ర ఆదిత్య అన్నదాన “రాజపోషకులు” — 10000 /-  పైన 
3. సహస్ర ఆదిత్య అన్నదాన “పోషకులు” — 2000 /-  పైన  
4. ఒక్క రోజు అన్నదానమునకు —  1000/-

1. శాశ్విత నిధికి ఇచ్చు వారి గోత్రనామాలతో సూర్యనమస్కారములు, మాహా సౌర మంత్ర హవనము, శ్రీ సూర్య నారాయణ స్వామీ వార్కి క్షీరాభిషేకం జరిపి వెండి సౌరయంత్రమును ఇచ్చెదము. 
2. రాజపోషకులుకు — వెండి సౌరయంత్రమును ఇచ్చెదము. 
3. పోషకులు, ఒక్కరోజు అన్నదానము చేయువారికి — రాగి సౌరయంత్రం ఇచ్చెదము. 

విరాళాలు చెల్లించే వారు ఈ క్రింది అడ్రస్ నందు నేరుగా గాని ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించగలరు. 


సవితా వేదిక్ ఫౌండేషన్ 
 శ్రీ సూర్యసదనం, గర్భా మ్ రోడ్డు, గరివిడి – 535101. 
 విజయనగరం జిల్లా (ఆ. ప్ర). 
  ఫోన్ :  9866810246, 9550295566, 08952282088.