ప్రతి వారము జరుగు కార్యక్రమములు

ప్రతి ఆదివారము : సూర్యనారాయణ స్వామి వారికీ విశేష అర్చన, అభిషేకము, ఆరాధనలు.

తృచ, సౌర, అరుణ పూర్వక సూర్య నమస్కారములు. సర్వకామ్య సిద్దికి మహా సౌర మంత్ర హవనము జరుగును.

భక్తులు తమ గోత్ర నామములతో చేయిన్చుకోనవచును. వ్యక్తిగతముగా హాజరు కావచ్చును. .
ఫలితము: ఆరోగ్య ప్రాప్తి, కామ్యసిద్ది కలుగును. .

పై కార్యక్రమములు 9 వారములు, 12 వారములు, 24, 36 వారములు చేయబడును.
ప్రతి బుధవారం: అష్టద్రవ్య లక్ష్మీ గణపతి మంత్రం హవనము, 32 గణపతుల మూలమంత్రహవనము, చతురావృతి తర్పణము జరుగును.
ఫలితముసర్వకామ్య జయము, విద్యా, ఉద్యోగ ప్రాప్తి.

ప్రతి మాసము జరుగు కార్యక్రమములు

తెలుగు నెలల ప్రకారం శుద్ధ సప్తమి అనగా పౌర్ణమి కి ముందు వచ్చు సప్తమి తిధి యందు శ్రీ ఉషా, శ్రీ పద్మిని సహిత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగును.

సాయంత్రం: “ఆదిత్య సవనము మరియు “మహా సుదర్శన” మంత్రహవనము జరుగును.

ప్రతి తెలుగు మాసము యందు పౌర్ణమి తిధి రోజున శ్రీ దేవి, భూదేవి, సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగును. 

సాయంత్రం: శ్రీ చండి సప్తశతీ మంత్రహవనము, శ్రీ ప్రత్యన్గిర మంత్ర హవనము, శ్రీ రాజశ్యాములా, రాజమతంగి, సుక శ్యామలాదేవి మంత్ర హవనం జరుగును.

ప్రతి మాస శివరాత్రి తిది యందు శ్రీ మహా మృత్యుంజయెస్వర, ఉమామహేశ్వర, ద్వాదాశ జ్యోతిర్లింగ, ఏకాదశరుద్ర, ఉమాపార్దివేస్వర ప్రీతికరముగా ఏకాదశావరణ సహిత మహాలింగార్చన, అభిషేకము, రుద్ర మంత్రహవనము జరుగును. 

ఫలితము: అపమృత్యుదోషహరము, గ్రహశన్తి.

 

ప్రతి సంవత్సరము జరుగు కార్యక్రమములు

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములను అనుసరించి వచ్చు పర్వదినములలో చైత్ర పౌర్ణమి (మహా చైత్ర ) వైశాఖ పౌర్ణమి (మహా వైశాఖి ) జ్యేష్ట పౌర్ణమి, ఆషాడ పౌర్ణమి (మహా ఆషాడ, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, పరమపూజ్య సద్గురు కృష్ణయాజీ గారి జన్మదినోత్సవం)

శ్రావణ పౌర్ణమి : శ్రీ ప్రసన్న వేంకటేశ్వర కళ్యాణం, వైఖానస జయంతి, సౌభాగ్యప్రద, సర్వమంళాదేవి మంత్రహవనం, బహుళ అష్టమి శ్రీ కృష్ణ జయంతి, శ్రీ రుక్మిణి రాధ సహిత శ్రీ కృష్ణ కళ్యాణం.

భాద్రపద మాసం : వినాయక చవితి నుండి 9 రోజులు శ్రీ షోడశ గణేశ యాగము. లక్షప్రతి పూజ జరుగును.
ఆశ్వయుజమాసం: శరన్నవరాత్రులు – శ్రీ నవదుర్గ సహిత చందియాగము శ్రీ చక్రార్చన.
కార్తిక మాసము : కార్తిక దామోదర అర్చన, ఆరాధనలు, అభిషేక మంత్రం హవనాదులు.
మార్గశిర మాసం : అష్టలక్ష్మి కుబేర అర్చన, ఆరాధనా మంత్రం హవనాదులు.
పుష్యమాసం : నవగ్రహ మఖము, కాలసర్పదోష శాంతి, దశావతార దేవత అర్చన., సౌర దీక్ష, ప్రారంభము, నక్షత్ర శాంతి, మంత్రం హవనము జరుగును.
మాఘమాసం : మహాసౌర యాగం, ద్వాదశాదిత్య ఆరాధన, హవనము.
ఫాల్గుణ మాసము: శ్రీ వల్లిదేవ సహిత సుబ్రహ్మాణ్యెస్వర, పుత్ర గణపతి అర్చన, ఆరాధనలు నృసింహజయంతి.
పై ఆధ్యాత్మిక, వైదిక కార్యక్రమములే కాకా విశేష పర్వదినములననుసరించి ఆయా దేవతల అర్చన, ఆరాధన, అభిషేక, మంత్ర హవనాదులు జరుపబడును.